ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్ ​ఫొటోగ్రఫీ కాంటెస్ట్

ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్ ​ఫొటోగ్రఫీ కాంటెస్ట్

హైదరాబాద్, వెలుగు: దేశంలోని నేషనల్ హైవేస్ ఫొటోలు తీసి పంపాలని, ఎంపికైన ఫొటోలకు బహుమతులు ఇవ్వనున్నట్లు నేష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ల్ హైవేస్​ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​లో భాగంగా డిజిట‌‌‌‌‌‌‌‌ల్ ఫొటోగ్రఫీ కాంటెస్ట్ 2022 నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నేషనల్ హైవేస్  ఫొటో తీసి, ఎన్ హెచ్ఏఐ అధికారిక https://www.nhai.gov.in. వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో వచ్చే నెల 22 వ తేదీలోగా అప్​లోడ్ చేయాలని సూచించింది. ఉత్తమ ఫొటోలను ఎంపిక చేసి ఫొటోగ్రాఫర్లకు బ‌‌‌‌‌‌‌‌హుమ‌‌‌‌‌‌‌‌తులు ఇస్తామ‌‌‌‌‌‌‌‌ని వివ‌‌‌‌‌‌‌‌రించింది. మొదటి ప్రైజ్ కింద రూ.50 వేలు, రెండో ప్రైజ్ 30 వేలు, మూడో ప్రైజ్ కింద 20 వేల నగదు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.