డీఎస్సీ 1998 అభ్యర్థులకు ఉద్యోగాలివ్వండి : బి.నర్సింహారెడ్డి

డీఎస్సీ 1998 అభ్యర్థులకు ఉద్యోగాలివ్వండి : బి.నర్సింహారెడ్డి

ఖైరతాబాద్, వెలుగు :  ఉమ్మడి ఏపీలో నిర్వహించిన డీఎస్సీ 1998 నియామకాల్లో అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని, అక్రమంగా నాన్​లోకల్​అభ్యర్థులను టీచర్లుగా నియమించారని డీఎస్సీ1998 క్వాలిఫైడ్​యూనియన్​అధ్యక్షుడు బి.నర్సింహారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ప్రెస్​క్లబ్​లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అప్పటి నుంచి న్యాయపోరాటం చేస్తున్నామని, సుమారు 2 వేల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. కొందరి వయస్సు అయిపోయిందని, ఇప్పుడున్న వారిలో అర్హులకు కాంగ్రెస్​ప్రభుత్వం ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని కోరారు. ఏపీ ప్రభుత్వం అప్పటి వారందరికీ ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తుచేశారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి సంజీవ్​, తుమ్మన పల్లి శ్రీనివాస్​,ఇషాక్​అలి, శర్మ తదితరులు మాట్లాడారు.