ఆరుగురు వ్యక్తుల జీవితాల్లో ఒక రోజు జరిగిన అనుకోని ఓ ఘటనతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న క్రైమ్ కామెడీ మూవీ ‘బా బా బ్లాక్ షీప్’. టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయే, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, రాజా రవీంద్ర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గుణి మంచికంటి దర్శకత్వంలో వేణు దోణెపూడి నిర్మిస్తున్నారు.
శుక్రవారం టీజర్‌ను హీరో శర్వానంద్ విడుదల చేసి బెస్ట్ విషెస్ చెప్పాడు. టీజర్‌ను గమనిస్తే.. చుట్టూ పచ్చదనం, కొండలున్న అందమైన ఊరిని చూపిస్తారు. ‘చెప్పుకోవడానికి ఇది మామూలు కథ కాదు. అండ పిండ బ్రహ్మాండాలను కూడా అల్లాడించే కథ’ అనే డైలాగ్ వినిపించగా ఈ గ్యాప్‌లో కొంత మంది గన్స్‌తో కనిపిస్తారు. గన్ ఫైరింగ్, కార్ చేజింగ్ సీన్స్‌తో ఎంగేజింగ్‌గా టీజర్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ ‘సినిమా మొత్తాన్ని మేఘాలయాలోనే పూర్తి చేశాం. అతి తక్కువ రోజుల్లోనే పక్కా ప్లానింగ్‌తో సినిమాను కంప్లీట్ చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’ అని అన్నారు.
