ICC awards: బాబర్ ఆజమ్ ఖాతాలో రెండు ఐసీసీ అవార్డులు

ICC awards: బాబర్ ఆజమ్ ఖాతాలో రెండు ఐసీసీ అవార్డులు

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఐసీసీ మెన్స్ అవార్డుల్లో దుమ్మురేపుతున్నాడు. బుధవారం ప్రకటించిన ఐసీసీ అవార్డుల్లో ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2022, ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డులు గెలుచుకున్నాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన బాబర్, 9 వన్డేల్లో 679 రన్స్ చేశాడు. ఓవరాల్ గా చూస్తే 2022లో ఆడిన 44 మ్యాచుల్లో 54.12 సగటుతో మొత్తం 2,598 రన్స్ చేశాడు. అందులో 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డు అందుకున్నాడు. గతేడాది స్టోక్స్ టెస్టుల్లో 26 వికెట్లు పడగొట్టడంతో పాటు 870 రన్స్ చేశాడు.