
హైదరాబాద్, వెలుగు: తాను బీఆర్ఎస్పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బాబుమోహన్అన్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ నుంచే పోటీ చేస్తానని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తనకు కేసీఆర్ఇటీవల కాలంలో ఎప్పుడూ ఫోన్ చేయలేదని, ఆయనతో మాట్లాడి ఆరేండ్లు అవుతున్నదని చెప్పారు. తనపై వచ్చే పుకార్లు నమ్మవద్దని బాబుమోహన్ కోరారు.