
జీడిమెట్ల, వెలుగు: రోడ్డుపై శిశువు డెడ్‌బాడీ భాగాలు కలకలం రేపాయి. పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. జీడిమెట్ల డివిజన్ ఎంఎన్రెడ్డినగర్ మెయిన్ రోడ్డుపై గురువారం నవజాత శిశువు మృతదేహం భాగాలు కన్పించాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు డాగ్‌స్వ్కాడ్, క్లూస్‌టీంతో తనిఖీలు చేశారు. డాగ్‌స్వ్కాడ్ కొంతదూరం వెళ్లి వెనక్కి వచ్చాయి. దీంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ ఇదే తరహాలో ఘటన చోటు చేసుకుందని స్థానికులు గుర్తుచేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.