మామిడి పండు తిన్న వెంటనే కొన్ని ఫుడ్స్ తినకూడదు. అవేంటంటే.. మామిడి పండు తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపునొప్పి వస్తుంది. ఎసిడిటీ బారిన పడతారు. అందుకే మామిడిపండు తిన్న అరగంట తరువాతే నీళ్లు తాగాలి. పెరుగు, మామిడిపండును కలిపి తినొద్దు. మామిడి వల్ల వంట్లో వేడి చేస్తుంది.
పెరుగు చల్లబరుస్తుంది. ఈ రెండింటిని కలిపి తింటే స్కిన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టాక్సిన్స్ కూడా ఏర్పడతాయి. మామిడిపండు తిన్నాక, కాకరకాయ కూర తింటే వికారం, వాంతులు అవుతాయి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. మామిడి పండు తిని వెంటనే కూల్ డ్రింక్స్ తాగితే బాడీలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
ఇదిలా ఉండగా.. ఒకప్పుడు వేసవి అంటే మామిడి రుచుల సందడి గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తున్న పండ్లలో సహజమైన తీపి, వాసన, రుచి కనిపించడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పండ్లను వేగంగా మగ్గించేందుకు కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ఎసిటిలిన్ వాయువును విడుదల చేసి పచ్చికాయను త్వరగా పసుపు రంగులోకి మారుస్తుంది. అయితే, ఇది కేవలం రంగును మాత్రమే మారుస్తుందని, సహజంగా జరిగే చక్కెర మార్పులు, పోషక విలువల అభివృద్ధి జరగవని హార్టికల్చర్ నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి పండ్లలో ఫ్రక్టోజ్ స్థాయిలు తగ్గిపోవడంతో తీపి తగ్గిపోతుంది. పైగా పండ్లు తిన్న తర్వాత గొంతు గీరగా అనిపించడం, కడుపులో అసౌకర్యం, చేదు రుచి వంటి సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాల్షియం కార్బైడ్‌లో ఉండే ఆర్సెనిక్, ఫాస్పరస్ మలినాలు ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు.
