SRH vs RR: న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 'ఎలిమినేటర్' మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) అద్భుత విజయాన్ని అందుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై పరుగుల తేడాతో ఘన విజయం సాధించి క్వాలిఫయర్-2 లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో మే 29వ తేదీన జరగబోయే క్వాలిఫయర్-2 పోరులో గుజరాత్ టైటాన్స్ తో రాజస్థాన్ పోటీ పడబోతుంది. మరోవైపు, ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఓటమితో ఇంటికి వెళ్లిపోయింది.
రాజస్థాన్ బ్యాటర్ల విధ్వంసం:
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు సన్‌రైజర్స్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (97 రన్స్), ధ్రువ్ జురెల్ (హాఫ్ సెంచరీ) చెలరేగడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 244 పరుగుల టార్గెట్ ని పెట్టింది.
జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగే బౌలింగ్:
244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఎస్ఆర్‌హెచ్ టాప్ ఆర్డర్‌ను దారుణంగా దెబ్బతీశాడు. రన్ రేట్ వేగంగానే ఉన్నప్పటికీ.. వరుసగా కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయి ఆరెంజ్ ఆర్మీ బిగ్ ట్రబుల్‌లో పడింది. హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ మొదటి ఓవర్ రెండో బంతికే విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ పరుగుల ఖాతా ఓపెన్ చేయకుండానే (డకౌట్) అవుట్ అయ్యాడు. వికెట్ పడినా సన్‌రైజర్స్ బ్యాటర్లు తగ్గేదేలేదన్నట్లు ఆడటంతో 0, W (వికెట్), 2, 6, 4, 4 ఆ ఓవర్లో ఏకంగా 16 పరుగులు వచ్చాయి.
ఇషాన్ కిషన్ మెరుపులు.. హెడ్‌ను క్లీన్ బౌల్డ్:
అభిషేక్ అవుట్ అయినా క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ రాజస్థాన్ బౌలర్లను చీల్చి చెండాడుతూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నాండ్రే బర్గర్ వేసిన రెండో ఓవర్లో సన్‌రైజర్స్ బ్యాటర్లు 2, 4WD, 1, 0, 1, 6, 4 లతో ఏకంగా 19 పరుగులు పిండుకున్నారు. ఇషాన్ కిషన్ కేవలం 11 బంతుల్లోనే 33 రన్స్ చేసి సన్‌రైజర్స్ క్యాంప్‌లో జోష్ నింపాడు. కానీ, ప్రమాదకరంగా మారిన కిషన్‌ను జోఫ్రా ఆర్చర్ మళ్లీ దెబ్బకొట్టి అవుట్ చేశాడు. ఇషాన్ కిషన్ అవుట్ అయిన వెంటనే రాజస్థాన్ బౌలర్లు మ్యాచ్‌ను పూర్తిగా తమ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. సన్‌రైజర్స్ వరుస ఓవర్లలో వికెట్లు సమర్పించుకుంది. సెండ్ డౌన్‌లో వచ్చిన స్మరణ్ రవిచంద్రన్‌ను నాండ్రే బర్గర్ పెవిలియన్ పంపగా.. సన్‌రైజర్స్ ఆశలన్నీ మోస్తున్న మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (17 పరుగులు) ను జోఫ్రా ఆర్చర్ తన అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.
చేతులెత్తేసిన మిడిల్ ఆర్డర్.. నితీశ్ ఒంటరి పోరాటం:
టాప్ ఆర్డర్ కుప్పకూలిన తర్వాత సన్‌రైజర్స్ మిడిల్ ఆర్డర్ కూడా పూర్తిగా తడబడింది. ఎస్ఆర్‌హెచ్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన స్టార్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ (కాటేరమ్మ కొడుకు) కూడా పెద్దగా రాణించలేదు. కేవలం 18 రన్స్ మాత్రమే చేసి యశ్ రాజ్ పుంజా బౌలింగ్‌లో LBWగా వెనుతిరిగాడు. ఇక చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి కాసేపు దూకుడుగా బ్యాటింగ్ చేసి ఆశలు రేపాడు. 38 పరుగులు చేసిన నితీశ్.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో దాసున్ శనకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. కేవలం 1 రన్ మాత్రమే చేసి సుశాంత్ మిశ్రా బౌలింగ్‌లో డగౌట్‌కు చేరాడు.
మరో ఎండ్‌లో ఉన్న సలీల్ ఆరోరా మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డుని ముందుకు నడిపించే క్రమంలో జడేజా బౌలింగ్‌లో ఓ భారీ సిక్సు కొట్టాడు. కానీ ఆ తర్వాతి బంతికే నాండ్రే బర్గర్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం నుంచి నిష్క్రమించాడు. చివర్లో శివాంగ్ కుమార్ దూకుడుగా బ్యాటింగ్ చేసినప్పటికీ హైదరాబాద్ 196 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 47 రన్స్ తేడాతో గెలిచి క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది.
Qualifier 2 is officially locked in! 🔒
— IndianPremierLeague (@IPL) May 27, 2026
One final hurdle to the summit clash 🎟️#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR pic.twitter.com/y73BAkfWXC
