టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. 

టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. 

SRH vs RR: న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య హై-వోల్టేజ్ 'ఎలిమినేటర్' మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో రాజస్థాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి రాబోతుంది. టాస్ గెలిచి ఛేజింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ముల్లాన్‌పూర్ పిచ్ కండిషన్స్ ప్రకారం భారీ అడ్వాంటేజ్ లభించనుంది. మరి మొదట బ్యాటింగ్ చేయబోతున్న రాజస్థాన్ రాయల్స్ బోర్డుపై ఎంత భారీ స్కోరు పెట్టే అవకాశం ఉంది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. మేము మొదట బౌలింగ్ చేయబోతున్నాం.. ఇటీవలి కాలంలో మేము చాలా మంచి క్రికెట్ ఆడాం.. ఈ మ్యాచ్‌లో మా బౌలింగ్‌ను సింపుల్‌గా ఉంచడానికే ప్రయత్నిస్తాం, ప్రత్యర్థి జట్టును వారి బలాలకు తగినట్లు ఆడనిస్తాం.. మా జట్టులోకి ప్రఫుల్ హింగే మళ్లీ తిరిగి వచ్చాడు.. మేము మ్యాచ్ ఒత్తిడి గురించి అస్సలు ఆలోచించడం లేదు, ఎందుకంటే ఇది లక్ష్య ఛేదనకు చాలా మంచి గ్రౌండ్ అని కమిన్స్ పేర్కొన్నాడు. 

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. టాస్ గెలిచి ఉంటే మేము కూడా మొదట బౌలింగ్ తీసుకునేవాళ్లం, ఎందుకంటే ఇది ఛేజింగ్‌కు చాలా అనుకూలమైంది.. ఈ గ్రౌండ్‌లో మేము గతంలో లక్ష్యాలను ఛేదించాం, అలాగే స్కోర్‌లను డిఫెండ్ కూడా చేశాం.. ప్రస్తుతం నేను ఆడటానికి అన్‌ఫిట్ (రియాన్) గా ఉన్నాను.. అయినప్పటికీ, టోర్నీలో ముందడుగు వేయడానికి ఇప్పుడు మా ముందు గెలవడం మినహా వేరే ఆప్షన్ లేదు.. జట్టు ఆటగాళ్లు తమ పూర్తి సామర్థ్యం మేరకు రాణిస్తే ఈ ప్రదర్శన పట్ల నేను హ్యాపీగా ఉంటాను.. మా జట్టులోకి జడ్డూ (రవీంద్ర జడేజా) తిరిగి వచ్చాడు, శుభమ్ దూబే ఇంపాక్ట్ ప్లేయర్‌గా వస్తాడని పేర్కొన్నారు.  

ఇరు జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w), హెన్రిచ్ క్లాసెన్, స్మరన్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(సి), శివంగ్ కుమార్, ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా