ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హీరో నుంచి సరికొత్త బైక్ విడుదలైంది.హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్ టెక్ 25.0బైకును చేసింది. మునుపటి మోడల్ లో స్వల్ప స్టైలింగ్ మార్పులు, అదనపు ఫీచర్లతో ఈ బైక్ వచ్చింది. 125సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో లీటర్ పెట్రోల్ కు 72 కి.మీల మైలేజ్ ను అందిస్తుంది.
ఫీచర్ల విషయానికి వస్తే..XTEC 2.0 బ్లూటూత్ కనెక్టివిటీ ,USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌తో కూడిన అదే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఈ బైకులో హజార్డ్ లైట్లు కీలకమైన అదనపు ఫీచర్ జోడించారు.స్టైలింగ్ అప్డేట్ లలో డ్యూయల్-టోన్ గ్రాఫిక్స్, XTEC 2.0 బ్యాడ్జింగ్, 3D సింబర్, కుట్టుతో కూడిన డ్యూయల్-టెక్చర్డ్ సీటు,రిమ్ టేపులు ఉన్నాయి. ఈ మోటార్‌సైకిల్ ఐదు రంగులలో లభిస్తుంది. గ్లాసీ బ్లాక్, క్యాండీ బ్లేజింగ్ రెడ్, మ్యాట్ యాక్సిస్ గ్రే, మ్యాట్ నెక్సస్ బ్లూ ,మ్యాట్ చెస్ట్‌నట్ బ్రౌన్ రంగుల ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.
ధర విషయానికి వస్తే రూ. 86,500 (ఎక్స్-షోరూమ్) ధరతో లభిస్తోంది. ఇది ప్రస్తుతం రూ. 88,044 ధర కలిగిన ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో సూపర్ స్ప్లెండర్ XTEC కంటే కొంచెం ధర తక్కువ.
