నా లైఫ్‌లో బెస్ట్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్: దర్శకుడు సాయి రాజేశ్

నా లైఫ్‌లో బెస్ట్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్: దర్శకుడు సాయి రాజేశ్

 71వ జాతీయ అవార్డ్స్‌‌‌‌లో  ‘బేబీ’  సినిమా రెండు నేషనల్ అవార్డ్స్ గెల్చుకుంది.  ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్‌‌‌‌‌‌‌‌గా దర్శకుడు  సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్‌‌‌‌‌‌‌‌గా పీవీఎన్ ఎస్ రోహిత్ (ప్రేమిస్తున్నా పాటకు) అవార్డ్ గెల్చుకున్నారు. ఈ సందర్భంగా శనివారం టీమ్ ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించింది. దర్శకుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ ‘రెండేళ్లు ప్రతి సీన్‌‌‌‌ను బెటర్ చేసుకుంటూ స్క్రిప్ట్ రాశా. 

 స్క్రీన్ ప్లేకు నేషనల్ అవార్డ్ రావడం చాలా హ్యాపీ. అలాగే ‘ప్రేమిస్తున్నా’ సాంగ్‌‌‌‌కు బెస్ట్ సింగర్‌‌‌‌‌‌‌‌గా అవార్డ్ వచ్చినందుకు ఆనందపడ్డా. నన్ను నమ్మిన ఎస్‌‌‌‌కేఎన్, హీరో హీరోయిన్ సహా టీమ్ అందరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు. సింగర్ పీవీఎన్‌‌‌‌ఎస్ రోహిత్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ముందు నా కెరీర్ మరోలా ఉండేది. నా పాటలు వేరే సింగర్స్‌‌‌‌తో రీప్లేస్ అయ్యేవి. ‘బేబీ’లో పాట పాడే అవకాశం వచ్చినప్పుడు డూ ఆర్ డై అని ఫీలయ్యా. అదే పాటకు బెస్ట్ సింగర్‌‌‌‌‌‌‌‌గా అవార్డ్ రావడం నా లైఫ్‌లో బెస్ట్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్’ అన్నాడు. ఈ అవార్డ్ మూవీలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉందని హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య అన్నారు.  ఈ సినిమా డబ్బుతో పాటు  ఎన్నో పురస్కారాలు తీసుకు  రావడం చాలా ఆనందంగా ఉందని నిర్మాతలు ఎస్‌‌‌‌కేఎన్‌‌‌‌, ధీరజ్ మొగిలినేని అన్నారు.