Vastu Tips : బ్యాచిలర్ రూమ్ కి వాస్తు ఉంటదా..?

Vastu Tips :  బ్యాచిలర్ రూమ్ కి వాస్తు ఉంటదా..?

నా వయసు 32 ఏళ్లు. మాది నిజామాబాద్ జిల్లా. కానీ ఉద్యోగం కోసం హైదరాబాద్లో ఉంటున్నా. ఇంట్లో ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరట్లేదు. నలుగురు స్నేహితులం కలిసి రూమ్ తీసుకుని ఉంటున్నాం. నాకు పెళ్లి కుదరకపోవడానికి, మా రూమ్ వాస్తుకు ఏమైనా సంబంధం ఉందా?  -విక్రమ్, కరీంనగర్ 

పెళ్లి కావాలంటే ఇంటి వాస్తు ఒక్కటే చూస్తే సరిపోదు. అది వాళ్ల జాతకాన్ని బట్టి ఉంటుంది. జన్మనక్షత్రం చూస్తే.. పెళ్లి ఘడియలు ఎప్పుడు ఉన్నాయో అంచనా వేసి చెప్పొచ్చు. అందులోనూ నలుగురు ఉండే బ్యాచిలర్ రూమ్ కాబట్టి, పెళ్లికి ఆ రూమ్ వాస్తుతో ఎలాంటి సంబంధం ఉండదు. పెళ్లి అనేది జ్యోతిష్యంతో ముడిపడి ఉంటుంది. మీరు జాతకం చూపించుకుంటే సరిపోతుంది. ఏవైనా దోషాలుంటే నివృత్తి చేసుకోవాలి. అప్పుడు అంతా మంచే జరుగుతుంది.

ALSO READ : ఏడో పాశురం విశిష్టత: ఇది పఠిస్తే అఙ్ఞానం తొలగుతుంది..!