
శంకర్ పల్లి, వెలుగు: ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ్రేటర్‌తో పాటు శివారు జిల్లాల్లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిల వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ రియల్టర్ నుంచి రూ.కోటి 20 లక్షల క్యాష్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తాన్ని ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అందజేసినట్లు సీఐ నరేశ్ తెలిపారు.
చేవెళ్లలో రూ.4 లక్షల 50 వేలు స్వాధీనం
చేవెళ్ల: వికారాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ వ్యాపారి కారును చేవెళ్ల మండలం అంతారం వద్ద పోలీసులు తనిఖీ చేశారు. రూ. 4 లక్షల 50 వేల క్యాష్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బుకు సంబంధించి అతడు ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.