నెట్‌‌‌‌‌‌‌‌ప్లిక్స్‌‌‌‌‌‌‌‌ డాక్యుమెంటరీ వివాదాన్ని పరిష్కరించండి

నెట్‌‌‌‌‌‌‌‌ప్లిక్స్‌‌‌‌‌‌‌‌ డాక్యుమెంటరీ వివాదాన్ని పరిష్కరించండి

హైదరాబాద్ : సత్యం రామలింగరాజుపై నెట్‌‌‌‌‌‌‌‌ప్లిక్స్‌‌‌‌‌‌‌‌ నిర్మించిన బ్యాడ్‌‌‌‌‌‌‌‌ బాయ్‌‌‌‌‌‌‌‌ మిలియనీర్స్‌‌‌‌‌‌‌‌ డాక్యుమెంటరీ వివాదాన్ని 3 వారాల్లోగా పరిష్కరించాలని సిటీ సివిల్‌‌‌‌‌‌‌‌ కోర్టును హైకోర్టు ఆదేశించింది. డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్​ చేయొద్దని 2020లో సిటీ సివిల్‌‌‌‌‌‌‌‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నెట్‌‌‌‌‌‌‌‌ప్లిక్స్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో  హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్‌‌‌‌‌‌‌‌ షమీమ్‌‌‌‌‌‌‌‌ అక్తర్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ నగేశ్ భీమపాక బెంచ్‌‌‌‌‌‌‌‌ బుధవారం విచారించింది.

డాక్యుమెంటరీని తన పరువుకు భంగం కలిగేలా తీశారని సత్యం రామలింగరాజు కోర్టుకు తెలిపారు. డ్యాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేయకుండా రెండేళ్ల క్రితం ఇచ్చిన ఉత్తర్వులను తొలగించాలని పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు లాయర్​ కోర్టును కోరారు. వాదనలు విన్న హైకోర్టు..  వివాదాన్ని 3 వారాల్లోగా పరిష్కరించాలని సిటీ సివిల్‌‌‌‌‌‌‌‌ కోర్టును ఆదేశించింది.