
- ఫ్రెండ్స్ తో ఈతకొట్టేందుకు వెళ్లగా ప్రమాదం
మధిర, వెలుగు : ఫ్రెండ్స్ తో ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా మధిర పెద్ద చెరువు వద్ద జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామానికి చెందిన విలారపు వంశీ(18), సమీపంలోని భగవాన్లపురం గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ తో కలిసి ఆదివారం సరదాగా మధిర పెద్ద చెరువు వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లారు.
లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లిన వంశీ మునిగిపోతుండగా.. ఫ్రెండ్స్ కాపాడేందుకు ప్రయత్నించారు. అతడు వారిని పట్టుకోవడంతో ప్రాణ భయంతో బయటకు వచ్చి వెంటనే స్థానికులకు తెలిపారు. స్థానిక స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు వెళ్లి చెరువులో గాలింపు చేపట్టి.. వంశీ డెడ్ బాడీని బయటకు తీశారు. మధిర పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.