గ్రేటర్ హైదరాబాద్‌లో బడంగ్‌పేట్-1 బిజెపి అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణ రెడ్డి(45) ఆత్మహత్య చేసుకున్నారు. ఏప్రిల్ 15న ఉదయం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్స్ వే విల్లాస్‌లో ఉన్న తన నివాసంలో రామకృష్ణ రెడ్డి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. . సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఏళ్ల రామకృష్ణ రెడ్డి బడంగ్‌పేట్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై నిరంతరం గళమెత్తేవారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోరాట పటిమ ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకునేంత బలహీనుడు కాదని స్థానికులు, అనుచరులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం మీర్‌పేట్ పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అసలు రామకృష్ణ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలేంటి? దీని వెనుక ఏదైనా ఒత్తిడి ఉందా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

