టీఆర్ఎస్‌‌కు బడంగ్ పేట్ మేయర్ రాజీనామా

టీఆర్ఎస్‌‌కు బడంగ్ పేట్ మేయర్ రాజీనామా

తెలంగాణలో అధికార పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఆపార్టీకి చెందినే కొంతమంది కీలక నేతలు ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. కొంతమంది ప్రజా ప్రతినిధులు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న క్రమంలో.. కొంతమంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. లెటెస్ట్ గా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. రాజీనామా పత్రాన్ని రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడికి పంపించారు. అనివార్య, వ్యక్తిగత కారణాల వల్ల తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. 

జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపడం జరిగిందని, పార్టీకి, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. బడంగ్ పేట అభివృద్ధి కాంక్షించి పార్టీలో చేరినట్లు, అప్పటి నుంచి పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడం కోసం కృషి చేశామ,న్నారు. క్రమశిక్షణతో పార్టీ పట్ల అంకితభావంతోనే తాము సేవలందించినట్లు. గడిచిన కొంతకాలంగా తమ పట్ల వ్యతిరేక భావనతో ఉంటున్నారని తెలిపారు. తాము ఆత్మగౌరవాన్ని చంపుకోలేక టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని ప్రకటించారు. పార్టీలో ఉన్నతిని ఓర్వలేక, ప్రజలలో పెరుగుతున్నటువంటి ఆదరాభిమానాలను జీర్ణించుకోలేక పోతున్నారని వెల్లడించారు అందుకే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. పార్టీలో సహకరించిన పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని నాయకులందరితో కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తామని హామీనిచ్చారు. గత రెండు సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు.