బీసీ రిజర్వేషన్ల కోసం నవంబర్ 10న రాష్ట్ర వ్యాప్త ఆందోళన: దండి వెంకట్

బీసీ రిజర్వేషన్ల కోసం నవంబర్ 10న రాష్ట్ర వ్యాప్త ఆందోళన: దండి వెంకట్
  • బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్

ముషీరాబాద్, వెలుగు : 42 శాతం బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలనే డిమాండ్ తో నవంబర్ 10న రాష్ట్రవ్యాప్త ఆందోళనకు బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ పిలుపునిచ్చారు. కలెక్టర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు పంపాలని నిర్ణయించినట్లు  తెలిపారు. బుధవారం నల్లకుంట బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ఆఫీసులో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. 

ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్​బిల్లులను కేంద్రానికి,  గవర్నర్ కు పంపి7 నెలలవుతున్నా పెండింగ్ లోనే ఉంచారన్నారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్చేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.