
హర్షివ్ కార్తీక్ హీరోగా నటిస్తూ, దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘బహుముఖం’. ఏప్రిల్ 5న సినిమా రిలీజ్. ఈ సందర్భంగా హర్షివ్ కార్తీక్ మాట్లాడుతూ ‘నేను యుఎస్‌లో సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. సినిమాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. పార్ట్ టైమ్‌గా ఎవరిదగ్గరైనా మూవీ వర్క్ చేయాలనుకున్నా. సమయం వృధా అయ్యింది కానీ సరైన ప్రాజెక్ట్ కుదరలేదు. ఇక నేనే సొంతంగా మొదలుపెట్టాలని నిర్ణయించుకుని ఈ కథ రాశా.
ఇదొక సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్. యూఎస్‌లోనే మొత్తం షూట్ చేశాం. అట్లాంటా, మాకాన్, కాంటన్ జార్జియా, యూఎస్‌ఎ పరిసర ప్రాంతాలలో చిత్రీకరించాం. మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తి ఓ ఆడిషన్‌కు వెళ్తే అక్కడ అతనికి అవమానం జరిగితే తర్వాత అతను ఎంతవరకూ వెళ్తాడనేదే ఈ కథ. ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్స్ ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్నారు. నటుడిగా దర్శకుడిగా ఓ యూనిక్ ప్రాజెక్ట్‌తో రావాలని ఇది చేశాను.
ప్రతీది వర్క్ షాప్ నిర్వహించి క్లియర్ విజన్ తో సినిమాని రూపొందించాం. చాలా డిపార్ట్‌మెంట్స్‌ని నేనే హ్యాండిల్ చేశా. సినిమాలో నేను ఉండకూడదు, కేవలం పాత్ర మాత్రమే కనిపించాలి. దీనికోసం ఆన్‌లైన్‌లో చాలా మెళకువలు నేర్చుకున్నా. కొన్ని ఆర్ట్ ఫామ్స్ చాలా ప్రాక్టీస్ చేశా. కథక్ నృత్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించా. ఇందులో నాతో సహా దాదాపు నలభై మంది కొత్తనటీనటులు కనిపిస్తారు. సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్స్‌ని ఇష్టపడే ఆడియెన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమా ఎక్కడా బోర్ కొట్టనివ్వదు’ అని చెప్పాడు.