చిన్నారి వైద్యానికి ఆర్థిక సాయం

చిన్నారి వైద్యానికి ఆర్థిక సాయం

కోల్​బెల్ట్, వెలుగు: ఊరు మందమర్రికి చెందిన బైరి చంద్రశేఖర్, రాజ్యలక్ష్మి దంపతుల ఐదు నెలల చిన్నారి వైద్య ఖర్చుల కోసం సోమవారం మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ బాధ్యులు రూ.20 వేల ఆర్థిక సాయం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారి శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతుండగా వారు స్పందించి ఆర్థిక సాయం అందించారు.  అధ్యక్షుడు బుబత్తుల శ్రీనివాస్, సభ్యులు ఈర్లపాటి సోమయ్య, గోలి సత్యనారాయణ, వెల్ది సాయికృష్ణ, గున్నాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.