రేపటి(జూలై 1) నుంచి  బజాజ్ బైబ్యాక్‌‌‌‌

రేపటి(జూలై 1) నుంచి  బజాజ్ బైబ్యాక్‌‌‌‌

న్యూఢిల్లీ:  టూ-వీలర్ కంపెనీ  బజాజ్ ఆటో లిమిటెడ్  రూ. 5,632.8 కోట్ల విలువైన షేర్‌‌‌‌‌‌‌‌ బైబ్యాక్ ప్రక్రియను బుధవారం నుంచి ప్రారంభిస్తామని ప్రకటించింది.  కంపెనీ రూ. 10 ఫేస్ వాల్యూ కలిగిన గరిష్టంగా 46.94 లక్షల పూర్తి పెయిడప్ ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. బజాజ్ ఆటో షేర్లు సోమవారం రూ.9,630 దగ్గర క్లోజవ్వగా,   ఒక్కో షేరుకు రూ. 12 వేలు చెల్లించేందుకు కంపెనీ ముందుకొచ్చింది.  ఈ బైబ్యాక్ ఆఫర్ వచ్చే నెల 1న ప్రారంభమై 7న ముగుస్తుంది.

కాగా,  బైబ్యాక్ ప్రతిపాదనకు ఈ ఏడాది  మే 6న బజాజ్ ఆటో బోర్డు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత మే 14న పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదారుల ప్రత్యేక తీర్మానాన్ని కోరగా.. జూన్ 18న విడుదలైన ఫలితాలలో మెజార్టీ షేర్‌‌‌‌హోల్డర్లు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ 24 ను రికార్డ్ డేట్‌‌‌‌గా నిర్ణయించారు.  బ్యాలెన్స్ షీట్ బలంగా ఉండటం, క్యాష్​ ఫ్లో బాగుండడంతో  ఈ నిర్ణయం తీసుకున్నట్లు బజాజ్ ఆటో తెలిపింది. ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌కు అవసరమయ్యే  పెట్టుబడులను  ఉంచుకుంటూనే, మిగులు నగదుతో బైబ్యాక్ ఇష్యూ చేపడుతున్నామని వివరించింది.