
అమరావతి: ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వికేంద్రీకరణ బిల్లుపై బుధవారం శాసన మండలి సభలో అధికార, విపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత కాసేపటికి సభ వాయిదా పడింది. సభ వాయిదా పడటంతో ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటుగా టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు మండలి గ్యాలరీలోనే వేచి ఉన్నారు. అదే గ్యాలరీలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో, వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్ఫీలు దిగి సందడి చేశారు. బాలకృష్ణ న్యూ లుక్ చూసి ఆశ్చర్యపోయిన రోజా ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. సెల్ఫీలో బాలకృష్ణ, చంద్రబాబుతో సహ ఇరు పార్టీలకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.