జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లను రోడ్డుపై పడేసిన బాలయ్య ఫ్యాన్స్

జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లను రోడ్డుపై పడేసిన బాలయ్య ఫ్యాన్స్

హైదరాబాద్ పెద్ద ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నందమూరి కుటుంబంలోని విబేధాలు బయటపడ్డాయి. జనవరి 18వ తేదీ.. నందమూరి తారక రామారావు వర్థంతిని పురస్కరించుకుని.. ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ పేర్లతో వారి ఫ్యాన్స్ భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. తండ్రికి నివాళులు అర్పించటానికి వచ్చిన బాలయ్య.. వాటిని చూసి ఫైర్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రాం పేర్లతో ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లను ఘాట్ నుంచి వెంటనే తొలగించాలంటూ ఆదేశించారు. 

బాలయ్య ఆదేశాలతో.. బాలకృష్ణ ఫ్యాన్స్.. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రాం ఫ్లెక్సీలు, బ్యానర్లకు పీకిపారేశారు. ఘాట్ ఆవరణ నుంచి వాటిని.. బయట రోడ్డుపై పడేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారు. బయట రోడ్లపై పడేశారు. ఈ పరిణామంలో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఉద్విగ్ర పరిస్థితి నెలకొంది. బాలయ్య ఆర్డర్స్ తో.. బాలయ్య ఫ్యాన్స్ రెచ్చిపోయి.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించటం విశేషం. వాటిని ఘాట్ ఆవరణ నుంచి బయట రోడ్డుపై పడేయటంతో.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు. 

తాతకు తగ్గ మనవడిగా.. ఆస్కార్ నటుడిగా ఎంతో గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ కు నందమూరి కుటుంబం ఇచ్చే విలువ ఇదేనా అని మనోవేదన చెందుతున్నారు. కొంత మంది ఫ్యాన్స్ అయితే.. బాలయ్య తీరును తప్పుబడుతున్నారు. నందమూరి కుటుంబం.. జూనియర్ ఎన్టీఆర్ ను ఎందుకు దూరం చేసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. కేవలం చంద్రబాబుకు మద్దతు ఇవ్వనంత మాత్రాన.. రాజకీయంగా మద్దతు ప్రకటించనంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ ను ఇలా అవమానించాలా అని బాధపడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. 

జూనియర్ ఎన్టీఆర్ కేవలం తన సినీ కెరీర్ పైనే దృష్టి పెట్టారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయినా కూడా బాలయ్య ఇలా వ్యవహరించటం.. అది కూడా కుటుంబానికి సంబంధించిన విషయంలో అని.. పెద్దాయన తాత ఎన్టీఆర్ కు నివాళులర్పించే సమయంలో.. ఓ కొడుకుగా.. బాబాయ్ గా బాలయ్య ఇలా వ్యవహరించటం ఏంటని ప్రశ్నిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్..