మాన్​సూన్​ పనుల్లో నిర్లక్ష్యంపై బల్దియా కమిషనర్ ​ఫైర్

మాన్​సూన్​ పనుల్లో నిర్లక్ష్యంపై బల్దియా కమిషనర్ ​ఫైర్

హైదరాబాద్, వెలుగు: మాన్​పనుల్లో నిర్లక్ష్యం వహించిన ఆఫీసర్లపై జీహెచ్ఎంసీ కమిషనర్​లోకేశ్​ కుమార్​ఫైర్​అయ్యారు. 38 మంది ఇంజనీర్లకు ఒకరోజు జీతం కట్ ​చేశారు. ఇలాగే వ్యవహరిస్తే సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరించారు. బల్దియా హెడ్డాఫీసులో మంగళవారం ఆయన ఇంజనీర్లతో సమావేశమయ్యారు.  

ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు చేసిన తనిఖీల్లో  లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్త బోర్డులు పెట్టని, నాలా పూడికతీత పనులను పూర్తిచేయని 14 డివిజన్లను గుర్తించామన్నారు. వాటి పరిధిలోని 38 ఇంజనీర్ల జీతాల్లో కోత విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ జోన్​లో 9 మంది, శేరింలింగంపల్లిలో 8, చార్మినార్ లో 9, కూకట్​పల్లిలో 6, ఖైరతాబాద్​లో నలుగురు, ఎల్బీనగర్ జోన్ లో ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. సమావేశం అయిపోయాక ఒక్కో పనికి ఐదారు సార్లు టెండర్లు వేసినా ఎవరూ రాకపోతే మనం ఏం చేస్తామని పలువురు ఇంజనీర్లు చర్చించుకున్నట్లు సమాచారం.