బాల్మర్ లారీలో ఉద్యోగాలు.. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. అప్లయ్ చేసుకోండి..

 బాల్మర్ లారీలో ఉద్యోగాలు.. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. అప్లయ్ చేసుకోండి..

బాల్మర్ లారీ అసిస్టెంట్ మేనేజర్, ఆఫీసర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 03.

పోస్టుల సంఖ్య: 38.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, బి.టెక్/ బీఈ, డిప్లొమా, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంఎస్సీ, ఎంబీఏ/ పీజీడీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 09. 

లాస్ట్ డేట్:  అక్టోబర్ 03. 

పూర్తి వివరాలకు  www.balmerlawrie.com వెబ్​సైట్​లో సంప్రదించగలరు.