బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ సైన్యం మరియు ప్రభుత్వ దురాగతాల గురించి గొంతెత్తిన బలూచిస్తాన్ యాక్టివిస్ట్ కరీమా బలూచ్ అనుమానాస్పద మృతిచెందారు. ఆమె కెనడాలోని టొరంటోలో శవమై కనిపించినట్లు బలూచిస్తాన్ అధికారులు తెలపారు. కరీమా బలూచిస్తాన్ నుంచి వచ్చి కెనడియన్ శరణార్థిగా మారారు. ఆమె 2016లో ప్రపంచంలోని 100 మంది ‘ప్రేరణాత్మక మరియు ప్రభావవంతమైన’మహిళలలో ఒకరిగా నిలిచారు. టొరంటోలో లభించిన మృతదేహం కరీమాదేనని ఆమె కుటుంబం నిర్ధారించింది.
కరీమా టొరంటోలో డిసెంబర్ 20 ఆదివారం తప్పిపోయింది. ఆమె చివరిసారిగా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కనిపించింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. ఆమె ఆచూకీ కోసం టొరంటో పోలీసులు ప్రజల సాయం కోరారు. బలూచ్ మహిళలకు కరీమా మార్గదర్శకురాలిగా నిలిచారు. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఆమె బలూచిస్తాన్ సమస్యను కూడా లేవనెత్తారు. భౌగోళికంగా ఎంతో ప్రాముఖ్యత మరియు ఎన్నో సహజవనరులను కలిగి ఉన్న బలూచిస్తాన్‌ను పాకిస్తాన్ కోసం నాశనం చేశారని మే 2019లో పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు. పాకిస్తాన్ అసమ్మతివాది చనిపోవడం ఇదే మొదటిసారి కాదు. గడిచిన మే నెలలో బలూచ్ జర్నలిస్ట్ సాజిద్ హుస్సేన్ కూడా స్వీడన్లో అనుమానాస్పదంగా చనిపోయాడు. అతను మార్చి 2న ఉప్పసాల నగరం నుంచి తప్పిపోయాడు.
పాకిస్తాన్ మిలటరీపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో పాక్ అసమ్మతివాదులు మరియు విమర్శకులు నిరంతరం భయపడుతున్నారు. మిలిటరీని మరియు మిలటరీ విధానాలను విమర్శించే వారు ఏజెన్సీలచేత వేధించబడుతున్నారు. పాకిస్తాన్ మిలిటరీ బలూచిస్తాన్ అమాయకులను ఎత్తుకెళ్లి చంపి మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్ 15 ఏళ్ళకు పైగా పాకిస్తాన్‌తో పోరాడి చివరికి చేతులెత్తేసింది. దాంతో అక్కడ పాక్ భద్రతా దళాల ఆగడాలు మితిమీరిపోయాయి. వేధింపులను బరించలేక బలూచ్ రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, మరియు మానవ హక్కుల కార్యకర్తలు బలూచిస్తాన్ నుంచి వెళ్లిపోయి యూరోపియన్ కౌంటీలలో శరణార్థులుగా ఆశ్రయం పొందుతున్నారు.
For More News..
అందుకే ఆయనకు ‘గుడిసెల వెంకటస్వామి’ అనే పేరొచ్చింది
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు ఆధార్ తప్పనిసరి
అర్ధరాత్రి బదిలీలపై మంత్రి సబిత ఫైర్!
