
ముషీరాబాద్, వెలుగు: దసరా పండుగ సందర్భంగా వైష్ణవ్ బండారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 3న నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 20వ దత్తన్న అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. సోమవారం సాయంత్రం రాంనగర్ లోని తన ఆఫీసులో సన్నాహక సమావేశం నిర్వహించారు.
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా 20 సంవత్సరాలుగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చింతల రామచంద్రారెడ్డి, ప్రేమ్ సింగ్ రాథోడ్, గౌతమ్ రావు, అశోక్, వేద కుమార్, ఆనంద్ గౌడ్, శ్యాంసుందర్ గౌడ్, పాశం యాదగిరి పాల్గొన్నారు.