మున్సిపల్ చట్టాన్ని గవర్నర్ వెనక్కి పంపడం హర్షదాయకం

మున్సిపల్ చట్టాన్ని గవర్నర్ వెనక్కి పంపడం హర్షదాయకం

మున్సిపల్ చట్టాన్ని గవర్నర్ వెనక్కి పంపడం ప్రజాస్వామ్య శక్తుల విజయమని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కేసీఆర్ నియంతృత్వ దోరణితో  ఇష్టారీతిలో చట్టాలు చేసిన సమయంలో గవర్నర్ నిర్ణయం హర్షదాయకమని అన్నారు. ఇది బీజేపీ విజయమని అన్నారు.

ఎన్నికల సంఘాన్ని కీలు బొమ్మగా మార్చే ప్రయత్నం జరుగుతుందని తాము గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్నారు దత్తాత్రేయ. తమతో పాటు మిగతా పార్టీలు ,ప్రజా సంఘాలు ఈ చట్టాన్ని వ్యతిరేకించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. మంచి సలహాలు ఇస్తే తీసుకునే పరిస్థితి లో ప్రభుత్వం లేదని. హైకోర్టు, ప్రతిపక్షాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవట్లేదని అన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చే ఆర్డినెన్స్ ను బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు. మున్సిపల్  చట్టం పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. అఖిలపక్షం సూచించిన విషయాలను చట్టంలో పొందు పరచి అప్పుడు చట్టం చేయాలని సూచించారు.

టీఆర్ఎస్ నేతలు దాడిని ఖండిస్తున్నా

తమ పార్టీ కార్యకర్తలపై టిఆర్ఎస్ నేతలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నానని దత్తాత్రేయ అన్నారు. మల్కాజిగిరి లో స్థానిక టిఆర్ఎస్ కార్యకర్తలు,  తమన కార్యకర్తలపై దాడి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు.  మీరు దాడులు చేసే కొద్ది మా బలం పెరుగుతుందని టీఆర్ఎస్ నుద్దేశించి అన్నారు. మా ఎదుగుదల ను చూసి ఓర్వలేక టిఆర్ఎస్ ఇలాంటి దాడులకు పాల్పడుతుందన్నారు.

హెరిటేజ్ భవనాలు కూలగొట్టి, కొత్త వాటిని నిర్మిస్తామనే నిర్ణయాన్ని సీఎం వెనక్కి తీసుకోవాలని దత్తాత్రేయ కోరారు. ఏ ప్రాంతంలోనైనా సరే బీసీల జనాభా 50 శాతం మించి ఉంటే వారికి 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు ఆయన అన్నారు.