
సీఎం కేసీఆర్ రాత్రి పూట కాకుండా పగలు నిర్ణయాలు తీసుకోవాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. తెలంగాణలో ప్రజలు కేసీఆర్ పాలనను చిదరించుకుంటున్నారన్నారు. రిజిస్ట్రేషన్ ల ప్రక్రియపై రాత్రి పూట నిర్ణయాలు తీసుకున్న తరువాత ప్రజల తిరుగుబాటుతో, బీజేపీ ఆందోళనలతో టిఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. మహబూబ్ నగర్ వెళ్తున్న బండి సంజయ్ కి రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ చెక్ పోస్ట్ వద్ద నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండి.. టిఆర్ఎస్ గడీలు బద్దలు కొడతామన్నారు. త్వరలోనే కేసీఆర్ తుగ్లకు పాలనకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. షాద్ నగర్ లో ఉన్న సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. బీజేపీ మలిదశ ఉద్యమం మొదలు పెట్టబోతుందన్నారు .