లిక్కర్ స్కాంపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించట్లే?: బండి సంజయ్

లిక్కర్ స్కాంపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించట్లే?: బండి సంజయ్

కేసీఆర్ బిడ్డ కవిత(mlc kavitha) వల్ల తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్(bandi sanjay అన్నారు. కవిత నోటీసులకు బీజేపీకి ఎటువంటి  సంబంధం లేదన్నారు. కవిత తీరుతో మహిళా లోకం సిగ్గుపడుతుందని చెప్పారు. ఇప్పటి వరకు లిక్కర్ స్కాం( delhi liquor scam) గురించి సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బిడ్డను కాపాడేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. లిక్కర్ స్కాంలో చట్టం తనపని తాను చేసుకుంటుందన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు.   కవిత తీరు దొంగే దొంగ అన్నట్లుందన్నారు. కవిత ఈడీ(ED) విచారణకు సహకరించాలన్నారు. పిళ్లై తనకు తెలుసని కవితే చెప్పారన్నారు. తప్పు చేయకపోతే కవిత కోర్టుకెళ్లి నిరూపించుకోవాలని సూచించారు.  కవితకు నోటీసులిస్తే తెలంగాణ సమాజానికి సంబంధం  ఏంటని ప్రశ్నించారు. 

మహిళా దినోత్సవాన్ని జరుపుకునే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు.  బీఆర్ఎస్(BRS) కు మహిళా అధ్యక్షులెవరో ఇంతవరకు తెల్వదన్నారు. తమ కుటుంబానికి ఏం జరిగినా తెలంగాణకు ఆపాదిస్తున్నారని అన్నారు.  మరోసారి కేసీఆర్ చేతిలో మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.  సీబీఐ,ఈడీ మోడీ పెట్టిన సంస్థలు కావని..కాంగ్రెస్ హయాం నుంచే ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ చేస్తున్న దందాలన్నింటికి  బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు.