
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత తప్పు చేస్తే శిక్ష తప్పదని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కవిత లిక్కర్ స్కాంలో ఉందని సీఎం కేసీఅర్, కేటీఆర్ కు కూడా తెలుసునని, అందుకే వాళ్లు మాట్లాడటం లేదన్నారు. అవినీతిని బీజేపీ సహించదని, మోడీ పాలనలో అవినీతికి స్కోప్ లేదన్నారు సంజయ్.
రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదన్న సంజయ్.. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలోఎన్ని డబుల్ బెడ్రూమ్ లు ఇచ్చారో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని,వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఫలితాలు తెలంగాణతో సంబంధం లేదని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు టికెట్ కోసం క్యాండిడేట్ల మధ్య పోటీ ఉందని చెప్పారు.
ఇక గ్రానైట్ లో వందల కొట్లు ముట్టాయని తనపై వస్తోన్న ఆరోపణలు బయటికి తీయాలని సంజయ్ సవాల్ విసిరారు. తనపై ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపాలన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని చెప్పారు. తనకు రాజగోపాల్ రెడ్డి మధ్య ఎలాంటి విభేదాలు లేవని,అదంతా మీడియా సృష్టినే అన్నారు. బీజేపీలోకి ఎవరూ వచ్చిన స్వాగతిస్తామని సంజయ్ స్పష్టం చేశారు.