
సీఎం కేసీఆర్ అక్రమ సంపాదన కోసం ప్రయత్నాలు చేసున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో కొన్ని ప్యాకేజీల కోసం కొత్తగా టెండర్లు పిలిచి..మెగా, నవయుగ, ప్రతిమ కంపెనీలకు కట్టబెట్టారన్నారు. లాక్ డౌన్ కు వ్యతిరేకంగా టెండర్లు పిలిచి ..సీఎం కేసీఆర్ దొంగలకు దోచి పెడ్తున్నారన్నారు. పాత ప్రాజెక్టులను కూడా కేసీఆర్ తన ఖాతాలో వేసుకుంటున్నారన్నారు. దొంగ లాగా అడ్డగోలు గా సంపాదించాలని చూస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ మెగా ముఖ్యమంత్రిగా మెగా స్కాం లు చేస్తున్నారని అన్నారు. లాక్ డౌన్ లో సీఎం ప్రెస్ మీట్ లు అపహాస్యంగా మారాయని, మీడియా తనకు అనుకూలంగా ఉందని సీఎం అనుకుంటున్నారని సంజయ్ విమర్శించారు. బెదిరించి మీడియాను కంట్రోల్ చేస్తున్నారన్నారు. మీడియా ను తాము గౌరవిస్తున్నాం కానీ వాళ్ళ ఎమ్మెల్యే లు జర్నలిస్ట్ ల మీద దాడులు చేస్తున్నారని సంజయ్ అన్నారు.
తాము ఏం మాట్లాడినా ప్రాజెక్టు లకు వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని సంజయ్ అన్నారు. బీజేపీ ప్రాజెక్టులకు, అభివృద్ధికి వ్యతిరేకం కాదని..కేసీఆర్ డైరెక్షన్ లో జరుగుతున్న లూటీ కి వ్యతిరేకమని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు ల మీద సీబీఐ విచారణ చేపట్టాలన్నారు.
మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు లో జరుగుతున్న అక్రమాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు .ప్రాజెక్టు లపై సీబీఐ విచారణ జరిపాలని గవర్నర్ ను కోరామన్నారు. ప్రతిపక్షాలపై సీఎం ఇష్టారాజ్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా అన్నారు.