అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలి

 అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలి

రాష్ట్రంలో రేషన్‌కార్డులను రద్దు చేయడంతోపాటు కొత్తరేషన్‌కార్డులు మంజూరు చేయకపోవడంపై జాతీయ మానవహక్కుల కమిషన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. రద్దు చేసిన 19 లక్షల రేషన్‌కార్డులు, కొత్త రేషన్‌కార్డుల మంజూరుపై విధించిన నిబంధనలపై దర్యాప్తు జరపాలని కోరారు. అర్హులైన పేదలకు కొత్తరేషన్‌కార్డులను మంజూరు చేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. కొత్త రేషన్‌కార్డుల మంజూరుపై విధించిన నిషేధాన్ని వెంటనే తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు. రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 19 లక్షల రేషన్‌కార్డులను రద్దు చేసిందని ఫిర్యాదులో బండి సంజయ్‌ పేర్కొన్నారు. కొత్తరేషన్‌కార్డుల కు సంబంధించి రాష్ట్రంలో  ప్రస్తుతం 7 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు.జూన్‌ 2021 నుంచి కొత్తరేషన్‌కార్డుల దరఖాస్తులను, మీ సేవా సెంటర్లు ఆమోదించడం లేదని ఆరోపించారు.