సర్పంచ్ ల సమస్యలపై గవర్నర్ కు బండి సంజయ్ ఫిర్యాదు

సర్పంచ్ ల సమస్యలపై గవర్నర్ కు బండి సంజయ్ ఫిర్యాదు

ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచ్ లకు  ఇస్తామన్న.. రూ.15 లక్షలు ఇవ్వట్లేదన్నారు బండి సంజయ్.  ఏమన్నా అంటే సర్పంచ్ లను  సస్పెండ్ చేస్తున్నారన్నారు.   స్వామి గౌడ్, పార్టీ నేతలు. సర్పంచులు, ఎంపీటీసీలతో కలిసి గవర్నర్ తో భేటి అయ్యారు. సర్పంచుల సమస్యలు, ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గవర్నర్ కు వివరించారు. దీంతో పాటు గుడాటిపల్లిలో పోలీసుల లాఠీ చార్జ్ లో గాయపడిన గౌరవెల్లి బాధితుల్ని కూడా గవర్నర్ తో కలిపించారు. దాడికి సంబంధించిన వివరాలను గవర్నర్ కు వివరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లకు ప్రభుత్వం కొట్లాట పెట్టించిందన్నారు  బండి సంజయ్. సర్పంచులు, MPTCలు, చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా.. సర్పంచ్ లపై ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందన్నారు.  ప్రశ్నించిన సర్పంచ్ లను వేధిస్తున్నారని. 12 ఏళ్ల నుంచి గౌరవెల్లి బాధితులకు పరిహారం అందలేదన్నారు బండి సంజయ్. అర్థరాత్రి భూ నిర్వాసితులపై, మహిళలపై విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే దాడులు చేస్తున్నారన్నారు. కేసీఆర్ అడ్రస్ గల్లంతవడం.. ప్రజల ఉసురు తగిలి కేసీఆర్ పిచ్చోడయి రోడ్లపైన తిరగడం ఖాయమన్నారు.