ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు క‌లిసి దోచుకుంటున్న‌రు

ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు క‌లిసి దోచుకుంటున్న‌రు

పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నెల 5న జీవో ఇస్తే.. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నార‌ని ప్ర‌శ్నించారు రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్. బుధ‌వారం ఆయ‌న బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో పోతిరెడ్డిపాడు వ్య‌వ‌హారంపై దీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన బండి సంజ‌య్..కేసీఆర్, జగన్ ఇద్దరు అన్నదమ్ములని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ అన్నార‌ని తెలిపారు. ఈ ఇద్దరి అన్నదమ్ముల మద్య ఒప్పందం ఏంటని అనుమానాలు కలుగుతున్నాయన్నారు. వీళ్ళిద్దరి మద్య రాజకీయ, ఆర్థిక రహస్య ఒప్పందాలు ఉన్నట్లుగా అనిపిస్తుందని..ఇద్దరు అన్నదమ్ములు కలిసి రెండు రాష్ట్రాలను దోచుకుంటున్నారని తెలిపారు.

కేసీఆర్ ది ఉద్యమం టైమ్ లో ఓ పద్ధతి, అధికారం వచ్చాక‌ ఓ పద్ధతి అని.. అధికారం అనుభవిస్తూ ప్రజల పొట్ట కొడుతుండన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగే పోతిరెడ్డిపాడు వ్యవహారాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ డైవర్ట్ చేస్తుండ‌ని.. పోతిరెడ్డిపాడుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామ‌ని తెలిపారు బండి సంజ‌య్.

ఉదయం 10 గంటలకు ప్రారంభమైన బండి సంజయ్ నిరసన దీక్ష, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. కృష్ణానది ప్రాజెక్టులపై టీఆర్ఎస్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.. తమ తమ ఇండ్లల్లోనే నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు ఉమ్మ‌డి మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు.

ఏపీ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల సామర్థ్యం పెంపుపై టీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరి..కేఆర్ఎంబీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ జీవో 203. తాజా జీవోతో పాత రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలపై దుష్ప్రభావం. సాగునీటి విషయంలో తెలంగాణ ప్రయోజనాలను విస్మరించారు సీఎం కేసీఆర్. కృష్ణ నదిలో తెలంగాణ వాటా 299 టీఎంసీల నీటిని సైతం పూర్తిగా వినియోగించుకోవడంలోనూ కేసీఆర్ విఫలం అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టవిరుద్ధ నీటి వినియోగంపై టీఆర్ఎస్ స‌ర్కార్ కు పట్టింపు లేద‌ని.. వాస్తవానికి పోతిరెడ్డిపాడు నుంచి 11000 క్యూసెక్కుల‌ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఎత్తిపోయాలి, కానీ 44,000 క్యూసెక్కు లకు దాని సామర్థ్యం పెంచారు. తాజాగా 80,000 క్యూసెక్కుల‌కు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచేందుకు జీవో.