
బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్లోని పార్టీ స్టేట్ ఆఫీసులో బీజేపీ నాయకులను, కార్యకర్తలను కలువనున్నారు. రాష్ట్ర చీఫ్గా నియమితులైన తర్వాత 15న హైదరాబాద్ వచ్చిన ఆయన.. స్వాగత సభలో పాల్గొని తిరిగి పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లారు. దీంతో చాలా మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు కలువలేకపోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో అందుబాటులో ఉండనున్నారు. 21 న సీనియర్ నేతలను కలుసు కొని ఆశీర్వాదం తీసుకోనున్నారు. 22 న కార్యకర్తలను, నాయకులను కలువనున్నారు.