
సీఎం కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్టయిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సీఎం KCR, మంత్రులు అబద్ధాలు చెప్తూనే ఉన్నారన్నారు. MLC ఎన్నికల్లో భాగంగా GHMC కార్పొరేటర్లతో బండి సంజయ్ సమావేశమయ్యారు. ఇక నుంచి ప్రజా సమస్యలపై కేసీఆర్ కు రిక్వెస్టులు చేయబోమని..వార్నింగ్ లే ఇస్తామన్నారు. త్వరలో KCR ఫాంహౌజ్ ముట్టడిస్తామన్నారు సంజయ్. కేసీఆర్ కు సీఎంగా ఉండటం ఇంట్రెస్ట్ లేదన్నారు. జైలు శిక్ష ఎలా తప్పించుకోవాలని కేసీఆర్ ఇప్పుడు ఆలోచిస్తున్నాడన్నారు. ప్రజలను, పాలనను KCR గాలికి వదిలేశాడన్నారు. రామంచందర్ రావు గెలుపు కోసం కష్టపడాలని కార్పొరేటర్లకు సూచించారు.