బండి సంజయ్ రాజీనామా.. కొత్త అధ్యక్షునిగా కిషన్ రెడ్డి

 బండి సంజయ్ రాజీనామా.. కొత్త అధ్యక్షునిగా కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష  పదవికి బండి సంజయ్  రాజీనామా చేశారు. ఢిల్లీలో నడ్డాతో ముగిసిన భేటీ అనంతరం సంజయ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 

అధ్యక్ష పదవికి సంబంధించిన మార్పులను బండి సంజయ్ కు వివరించారు జేపీ నడ్డా. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. బండి సంజయ్ సేవలను కేంద్రంలో వినయోగించుకోనున్నారు పార్టీ పెద్దలు.

తెలంగాణతో పాటుగా పలు రాష్ట్రాల అధ్యక్షులను బీజేపీ అధిష్టానం మార్చింది.  ఏపీలో సోము వీర్రాజును తొలిగించి ఆయన స్థానంలో మాజీ మంత్రి పురంధేశ్వరిని నియమించింది హైకమాండ్.