పైసలు పంజాబ్ కు.. ఉద్యోగాలు మహారాష్ట్రకు ఇస్తుండు: బండి సంజయ్

పైసలు పంజాబ్ కు.. ఉద్యోగాలు మహారాష్ట్రకు ఇస్తుండు: బండి సంజయ్

 సీఎం కేసీఆర్ మరోసారి సీఎం అయితే రాష్ట్రాన్ని ఆగం చేస్తాడని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ఇక్కడి రైతుల గోస కనిపించడం లేదు కానీ  పంజాబ్ రైతులకు కోట్లిచ్చాడని విమర్శించారు. తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలివ్వడు కానీ.. పక్క రాష్ట్రం నుంచి పార్టీలో జాయిన్ చేసుకుని లక్షల జీతం ఇస్తుండని మండిపడ్డారు.  

కేసీఆర్ పైసలు పంజాబ్ కు.. ఉద్యోగాలు మహారాష్ట్రకు ఇస్తున్నారని ధ్వజమెత్తారు బండి సంజయ్. బీఆర్ఎస్ సర్కార్ తాగుడికే ప్రిపరెన్స్ ఇస్తుందని.. అందుకే   కేసీఆర్ మద్యం రేట్లు తగ్గించారని విమర్శించారు. కేసీఆర్ ను ఇలానే వదిలేస్తే  స్విగ్గీ, జొమాటో వాళ్లతో ఇంటింటికి మద్యం సరఫరా చేయిస్తాడని అన్నారు. 

ఎక్కడ ఎన్నికలు జరిగినా కేసీఆరే డబ్బులు పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. రైతుల గోస ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. రిటైర్ అయిన సోమేశ్ ను సలహాదారుడిగా పెట్టుకుంటడు.. సంబంధం లేని మహా రాష్ట్ర వ్యక్తికి  కండువా కప్పి నెలకు  లక్షన్నర జీతం ఇస్తడని విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన కేసీఆర్ .. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ పై  ఇప్పటి వరకు స్పందించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ కు  ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి పైసలు వస్తుయ్ కానీ పథకాల అమలుకు రావడం లేదన్నారు. డబుల్ బెడ్రూంలు ఇవ్వడు, రైతులను ఆదుకోడు, ఉద్యోగాలివ్వడు, క్రీడాకారులను ఆదుకోడని ఇలాంటి సీఎం మనకెందుకని ప్రశ్నించారు.