ఫిబ్రవరిలోనే లోక్సభ ఎన్నికల కోడ్: బండి సంజయ్

ఫిబ్రవరిలోనే లోక్సభ ఎన్నికల కోడ్: బండి సంజయ్
  • ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా డ్రామాలెందుకు?
  • ఒక్కో వ్యక్తిపై లక్షన్నర అప్పు
  • బీజేపీ ఎంపీ బండి సంజయ్

షెడ్యూల్ ప్రకారం వచ్చే మార్చి, ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. అంతకంటే ముందే ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశముంది. ఈ విషయం తెలిసి కూడా దరఖాస్తుల కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేయడమంటే డ్రామాలాడటమే అని ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. 

వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని వెంకటంపల్లి గ్రామానికి వచ్చిన సంజయ్ మీడియాతో
మాట్లాడారు. 6 గ్యారంటీల పేరుతో కాల యాపన చేస్తే ప్రజలు హర్షించరనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తాము నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నామన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా అహంకార పూరితంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ నేత్తలకు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకో వాలని హెచ్చరించారు.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణను ఎట్లా గట్టె క్కిస్తారో, 6 గ్యారంటీలను ఎట్లా అమలు చేస్తారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఒక్కో వ్యక్తిపై లక్షన్నర రూపాయల అప్పు ఉందన్నారు. రేషన్ కార్డు ప్రాతిపదికగా 6 గ్యారంటీలను అమలు చేస్తామం పేదలకు న్యాయం జరగదని, వెంటనే కొ రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. సంక్షే పథకాల నిధులకు కేంద్ర సాయం అమ రమన్నారు. కేంద్రంలో మళ్లీ రాబోయే బీజేపీ ప్రభుత్వమేనన్నారు. అదనపు నిధుల రావాలంటే రాష్ట్రం నుంచి అత్యధిక బీజేపీ ఎంపీలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లన నియమించి కనీస సౌకర్యాలు కల్పించాల ని డిమాండ్ చేశారు. 'భారత్ ను, ప్రధా మోదీని దూషిస్తే ఫలితాలు ఎట్లుంటాయో మాల్దీవుల ప్రభుత్వానికి రుచి చూపించిన భారతీయులకు హ్యాట్సాఫ్ చెప్పారు.