హైదరాబాద్ డ్రగ్స్‎కు అడ్డాగా మారడానికి కేసీఆరే కారణం

హైదరాబాద్ డ్రగ్స్‎కు అడ్డాగా మారడానికి కేసీఆరే కారణం

హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారడానికి సీఎం కేసీఆర్ కారణమని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ డ్రగ్స్ విషయం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఆయన అన్నారు. నగరంలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే సొంతూళ్లకు రమ్మని ఒత్తిడి చేస్తున్నారన్నారు. నాంపల్లి బీజేపీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

‘హైదరాబాద్ ను మాఫియా, డ్రగ్స్ కు అడ్డాగా మార్చిన ఘనత కేసీఆర్‎ది, టీఆర్ఎస్‎ది. పంజాబ్ ప్రభుత్వం మారినట్లే.. డ్రగ్స్ దందాతో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కూలిపోనుంది. ఉడ్తా పంజాబ్ మాదిరిగానే.. ఉడ్తా హైదరాబాద్ కూడా వస్తది. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణలో డ్రగ్స్ దందా నడుస్తోంది. కేసీఆర్ కుటుంబ సభ్యుడికి తెలంగాణలో 112 వైన్స్ షాపులున్నాయి. డ్రగ్స్ కేసులో విచారణ చేసిన అధికారులను సైతం ఢిల్లీకి  పంపారు. విచారణ పేరుతో 2015 నుంచి ఏం సాధించారో కేసీఆర్ చెప్పాలి. డ్రగ్స్ కేసులో తన కుటుంబానికి సంబంధం ఉన్నందునే  ఈడీకి కేసీఆర్ సహరించలేదు. కేసీఆర్ విలనిజానికి.. ఒక ఐపీఎస్ బలైండు’ అని బండి సంజయ్ అన్నారు.

For More News..

కరోనా బూస్టర్ డోస్ పై కేంద్రం కీలక నిర్ణయం

‘ప్రజా సంగ్రామ యాత్ర’కు అనుమతివ్వండి