రేవంత్‌, హరీష్‌ ఫోన్‌లు కూడా ట్యాప్‌.. హరీష్ ఆ భయంతో ఏడాది ఫోన్ వాడలే: బండి సంజయ్

రేవంత్‌, హరీష్‌ ఫోన్‌లు కూడా ట్యాప్‌.. హరీష్ ఆ భయంతో ఏడాది ఫోన్ వాడలే: బండి సంజయ్

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం (ఆగస్టు 08) సిట్ ఎదుట సాక్ష్యం చెప్పిన బండి.. రాష్ట్రంలో ఎక్కువగా బీజేపీ నేతల ఫోన్లే ట్యాప్ అయినట్లుగా చెప్పారు. కాంగ్రెస్ నేతల ఫోన్లు ఎక్కువగా ట్యాప్ కాలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కేవలం రేవంత్ రెడ్డి ఫోన్ మాత్రమే ఎక్కువ సార్లు ట్యాప్ అయినట్లు చెప్పారు.  బీజేపీలో తన ఫోన్ ఎక్కువగా ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. 

కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావు కలిసి రాష్ట్రంలో సొంత పార్టీ నేతల ఫోన్లు కూడా వదలలేదని అన్నారు బండి. మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ భయంతో హరీశ్ రావు తన ఫోన్ ఒక ఏడాది పాటు ఫోన్ పక్కనపెట్టారని.. హరీశ్ ఫోన్ వాడలేదని బీఆర్ఎస్ నేతలే చెబుతున్నారని అన్నారు బండి సంజయ్. 

కేటీఆర్ ను ట్విట్టర్ టిల్లుగా అభివర్ణించిన బండి..  ఫోన్ ట్యాపింగ్ కు కారకులు కేసీఆర్.. కేటీఆర్, సంతోష్ రావు మాత్రమేనని అన్నారు . కేసీఆర్ కు సొంత బిడ్డది.. సొంత అల్లుడి ఫోన్ ఎలా ట్యాప్ చేయాలనిపించిందోనని ప్రశ్నించారు. కేటీఆర్ సొంత చెల్లి ఫోన్ ఎలా చేయించాడని  ట్యాప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

►ALSO READ | కేసీఆర్కు వావివరుసలేవ్.. ఆయన బిడ్డ కవిత ఫోన్ కూడా ట్యాప్: బండి సంజయ్

రేవంత్ అధికారంలోకి రాకముందు.. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా, కాళేశ్వరం.. కేసుల్లో కేసీఆర్ కుటుంబాన్ని అరెస్టు చేస్తామని చెప్పారని.. కానీ ఇప్పుడు ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సీఎం రేవంత్ కూడా పలు మార్లు అన్నారని.. అధికారులు ఆయనను విచారించగలరా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

కేంద్రంలో మీ పార్టే ఉండగా.. సీబీఐ ఎంక్వైరీ ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నకు.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేనిదే.. సీబీఐ రాష్ట్రంలోకి విచారణకు వచ్చే అవకాశం లేదని చెప్పారు. కేసీఆర్ హయాంలో సీబీఐ తెలంగాణకు వచ్చే ఛాన్స్ లేదని.. అందుకే సీబీఐ ఎంక్వైరీ చేయలేదని అన్నారు.