శిక్షణా తరగతుల్లో 14 అంశాలపై చర్చిస్తం : బండి సంజయ్

శిక్షణా తరగతుల్లో 14 అంశాలపై చర్చిస్తం : బండి సంజయ్

ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ అందాలన్నదే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. పార్టీ మూల సిద్ధాంతంతోనే రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే శిక్షణా తరగతుల్లో 14 అంశాలపై చర్చిస్తామని ఆయన వెల్లడించారు. సిద్దాంతాన్ని నమ్ముకున్న పార్టీ కాబట్టే.. క్రమక్రమంగా బలోపేతం చేసుకుంటున్నామని వివరించారు. దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందని సంజయ్​ తెలిపారు. శిక్షణా తరగతులు మూడు రోజుల పాటు జరగనున్నాయన్నారు. ఇందులో బీజేపీ పార్టీ చరిత్ర, భారత ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల గురించి పలువురు ప్రముఖులు వివరించనున్నారని పేర్కొన్నారు.  

ఇక వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ తొండి ఆటపై పోరాడి అధికారంలోకి వస్తామన్నారు. అధికార పార్టీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా టీఆర్ఎస్ పాలన ఉందన్నారు.