గెలిచాక పార్టీ మారితే తల్లిని మోసగించినట్టే : బండి సంజయ్‌‌‌‌

గెలిచాక పార్టీ మారితే తల్లిని మోసగించినట్టే : బండి సంజయ్‌‌‌‌
  • బీజేపీ నేతలు ప్రలోభాలకు లొంగొద్దు: బండి సంజయ్‌‌‌‌
  • కరీంనగర్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌లో మెజార్టీ స్థానాలు బీజేపీకేనని వెల్లడి

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కార్పొషన్ ఫలితాల్లో మెజారిటీ స్థానాలు బీజేపీకే దక్కబోతున్నాయని, గెలిచాక ఎవరైనా పార్టీ మారితే.. కన్నతల్లిని మోసం చేసినట్లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ప్రలోభాలకు తెరదీశారని, జాగ్రత్తగా ఉండాలని బీజేపీ అభ్యర్థులకు సూచించారు.  కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో గురువారం బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లతో బండి సంజయ్‌‌‌‌ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించబోతున్నామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల తరఫున ఏజెంట్లు ఎలా వ్యవహరించాలనే అంశంపై మాజీ మేయర్ సునీల్‌‌‌‌రావు వివరించారు. ఏజెంట్ల దృష్టి అంతా బ్యాలెట్ పేపర్ మీదే ఉండాలని చెప్పారు. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రంలో ఏదైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయాలని చెప్పారు.

కాగా, ఎన్నికల్లో గెలిస్తే కరీంనగర్ నుంచి కొండగట్టుకు పాదయాత్రగా వెళ్లి హనుమాన్‌‌‌‌ను దర్శించుకుంటే బాగుంటుందని సూచన రాగా.. అందరూ ఓకే చెప్పారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.