ఖబడ్దార్ కేటీఆర్.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రోడ్లమీద తిరగనియ్యం: బండిసంజయ్

ఖబడ్దార్ కేటీఆర్.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రోడ్లమీద తిరగనియ్యం: బండిసంజయ్

బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు  కేంద్రమంత్రి బండి సంజయ్ వార్నింగ్  ఇచ్చారు. అధికారం పోయినా కేటీఆర్ కు అహంకారం తగ్గదలేదన్నారు.  బీజేపీ నేతలను నోటికొచ్చినట్లు  తిడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇంకోసారి బీజేపీ నేతలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమన్నారు. కేటీఆర్ కాన్వాయ్ ను రోడ్లమీద తిరగనివ్వమని హెచ్చరించారు. 

కేసీఆర్ కుటుంబం  తెలంగాణకు చేసిందేమి లేదన్నారు.  పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. 2014 కు ముందు కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు ఎన్నో..ఇపుడెన్నో బయటపెట్టాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.

ALSO READ | తెలంగాణ స్కీంలు దేశానికే ఆదర్శం: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

హైడ్రా కూల్చివేతల్లో అక్బురుద్దీన్ కు ఒక రూల్..పేదలకు మరో రూలా? అని ప్రశ్నించారు బండిసంజయ్.  సల్కం చెరువులు అక్బురుద్దీన్ కాలేజీ కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు..ఇది ఆయన నిర్ణయమా.? ప్రభుత్వ నిర్ణయమా చెప్పాలన్నారు. మూసీలో పేదల ఇండ్లను కూలుస్తున్న హైడ్రా..అక్బరుద్దీన్  జోలికి ఎందుకు పోవడం లేదన్నారు.  అక్బరుద్దీన్ ఓవైసీ నిర్మాణాలు కూల్చే దమ్ము కాంగ్రెస్  ప్రభుత్వానికి లేదన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రజలు గమనించాలన్నారు బండి సంజయ్. 

సీఎం రేవంత్ రెడ్డి మీలో పౌరుషం చచ్చిపోయిందా?.  బీఆర్ఎస్ తో కుమ్కక్కైపోయారా?  కాళేశ్వరం సహా అన్ని స్కాంలు చేసిన ఆ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?. తెలంగాణ కేసీఆర్, కేటీఆర్ జాగీర్ కాదు.  ఖబడ్దార్...ఇష్టమొచ్చినట్లు చేస్తే మిమ్ముల్ని రోడ్లపై తిరగనియ్యం.  మీడియాపై దాడులు చేస్తే మీ అంతు చూస్తాం.  మీడియా సంస్థలపై దాడి  చేసిన  రెండు గంటల్లోనే మా కార్యకర్తలు టీ న్యూస్ ఛానల్ సంగతి చూస్తారు.   మీడియా స్వేచ్ఛను రక్షించడానికి  బీజేపీ సిద్ధంగా ఉంది. అని బండి సంజయ్ అన్నారు.