
తెలంగాణ స్కీంలు దేశానికే ఆదర్శమన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జుక్కల్ నియోజక వర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..పక్కనే కేసీఆర్ ఫార్మ్ హౌస్ ఉన్నా ఈ ప్రాంతం అభివృద్ధి జరగలేదని విమర్శించారు. డబుల్ బెడ్ రూంలు..దళితుణ్ణి సీఎం చేస్తానని నమ్మించి కేసీఆర్ పదేళ్లు మోసం చేశారని ఫైర్ అయ్యారు.
ALSO READ | మంత్రి వివేక్ వెంకటస్వామిని కొన్ని శక్తులు అణచివేయాలని చూస్తున్నాయి: గుమ్మడి కుమారస్వామి
ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్ గత పదేళ్లు.. తన కుటుంబ సభ్యులకు ఇచ్చారు. రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలోపే 60 వేల ఉద్యోగాలు ఇచ్చింది. రానున్న రెండేళ్లలో 2 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మిస్తాం. తెలంగాణ స్కింలు దేశానికి ఆదర్శం. హరీష్ రావువి తప్పుడు ప్రచారాలు. ఇది పేదల ప్రభుత్వం. వెనుకబడ్డ జుక్కల్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తాం. జుక్కల్ నియోజక వర్గంలో రూ.165 కోట్లతో పూర్తి స్థాయి రోడ్లు నిర్మిస్తాం. వెనుకబడ్డ జుక్కల్ నియోజక వర్గం అభివృద్ధి అయితేనే నిజమైన అభివృద్ధి జరిగినట్లు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి భాగోలేకపోయినా అభివృద్ధి పనులు చేస్తున్నాం. విద్యా, వైద్యంపై దృష్టిపెట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తుంది. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సహకారంతో లెండి, నాగమడుగు ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తాం. 9 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా ఇచ్చాం. నియోజక వర్గంలో వారం రోజుల్లో రూ. 20 కోట్ల వ్యయంతో 6 సబ్ స్టేషన్లు మంజూరు చేస్తామని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.