
సోమవారం ( జులై 7 ) గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాలమహానాడు సంఘం ప్రతినిధి గుమ్మడి కుమార స్వామి. ఆదివారం ( జులై 6 ) జరిగిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పౌర సన్మానానికి సహకరించిన నగర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు కుమారస్వామి. ఒక వర్గం సహకరించకపోయినా ప్రజలు సహకరించిన తీరు మరువలేనిదని అన్నారు. ప్రజల అభిమానం చూరగొన్న నేత వివేక్ వెంకటస్వామి అని.. అంచలంచలుగా ఎదుగుతున్న వివేక్ ను కొన్ని శక్తులు అణచివేయాలని చూస్తున్నాయని అన్నారు కుమారస్వామి.
ALSO READ : అక్బరుద్దీన్ కు ఒక న్యాయం.. పేదలకు ఇంకో న్యాయమా.. ? : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు
మంత్రి సన్మాన ప్లెక్సీలను పెట్టనీయకుండా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఇంచార్జి కమిషనర్ అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇసుక దోపిడీని అరికట్టి సంపదను ప్రభుత్వ ఖజానాకు మళ్లించి ప్రజలకు మేలు జరిగేలా చూస్తానని మంత్రి చెప్పడం జరిగిందని.. అదేవిధంగా ఎన్టీపీసీ జరుగుతున్న బూడిద మాఫియాను ఎన్టీపీసీ యజమాన్యం అరికట్టాలని అన్నారు.చీకటి దందాలపై నిఘా వ్యవస్థ నిగ్గు తేల్చాలని అన్నారు కుమారస్వామి.