
ఫాతిమా ఒవైసీ కాలేజీ వ్యవహారంలో హైడ్రా వైఖరిని ఖండించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు. అక్బరుద్దీన్ కు ఒక న్యాయం... అట్టడుగు పేదలకు ఇంకో న్యాయమా అంటూ ప్రశ్నించారు రామచందర్ రావు. అక్బరుద్దీన్ కాలేజీల్లో చదివే వాళ్ల జీవితాల మీకు ముఖ్యమా.. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మంది పేదల జీవితాలు మీకు పట్టవా అంటూ ప్రశ్నించారు.
కష్టపడి చెమటోడ్చి ఇండ్లు కట్టుకున్న మధ్య తరగతి ప్రజలు బతుకులు మీకు లెక్కలేవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రామచందర్ రావు.. తక్షణమే అక్రమంగా నిర్మించిన అక్బరుద్దీన్ కాలేజీ భవనాన్ని కూల్చేయాలని డిమాండ్ చేశారు.
ALSO READ : 40 నెలలుగా రెంటు పెండింగ్.. అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్టేషన్ కార్యాలయానికి తాళం...
హైడ్రా కూల్చేయకుంటే.. ప్రజల పక్షాన ఆ పని మేమే చేస్తామని హెచ్చరించారు రామచందర్ రావు. మీడియా సంస్థలపై బీఆర్ఎస్ దాడులు దుర్మార్గమని.. మీడియా సంస్థలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. తక్షణమే బీజేవైఎం కార్యకర్తలు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థలకు రక్షణ కల్పించాలని ఆదేశించారు.మీడియా సంస్థలపై చేయి వేస్తే.. టీ న్యూస్ ఛానల్ అంతు చూస్తామన్న హెచ్చరించారు రామచందర్ రావు.