
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం వేశాడు బిల్డింగ్ ఓనర్.. గత 40 నెలలుగా రెంటు కట్టకపోవడంతో సోమవారం ( జులై 7 ) ఆఫీస్ ఓపెన్ చేసే సమయంలో డోర్లకు తాళం వేశాడు ఓనర్. దీంతో విధులకు వచ్చిన సిబ్బంది, అధికారులు, రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన జనం ఆఫీసు బయటే పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడింది. గత 15 ఏళ్ళ క్రితం తన బిల్డింగ్ ను అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అద్దెకు ఇచ్చానని.. గత 38 నెలలుగా అద్దె చెల్లించట్లేదని చెప్పుకొచ్చాడు బిల్డింగ్ ఓనర్.
అద్దె చెల్లించట్లేదని పలుమార్లు జిల్లా స్థాయి అధికారుల దృషికి తీసుకెళ్లానని.. వారు కూడా స్పందించకపోవడంతో తాళంవేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు బిల్డింగ్ యజమాని. తాను వృత్తి రీత్యా మేస్త్రి పని చూస్తుంటానని.. బిల్డింగ్ పై లోన్ ఉందని.. ప్రతి నెల ఈఎంఐ కట్టడానికి చాలా ఇబ్బంది అబుతుందని పేర్కొన్నాడు బిల్డింగ్ యజమాని.
ALSO READ : ఆలేరులో ఐలయ్య మార్నింగ్ వాక్ ..50 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన
38 నెలలుగా అద్దె చెల్లించట్లేదని.. 15 రోజుల్లోగా అద్దె మొత్తం చెల్లించాలని, 4 నెలల్లో బిల్డింగ్ ఖాళీ చేయాలని సబ్ రిజిస్ట్రార్ కి రాసిన లేఖలో కోరాడు యజమాని. తనకు అద్దె మొత్తం చెల్లించకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవుతానని తెలిపారు యజమాని.