సీఎం కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సెర్ఫ్ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. రాష్ట్రంలో ఇకపై కాంట్రాక్టు కార్మికులు ఉండబోరని, వారిని పర్మినెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు కల్పిస్తామని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ కోసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని పేర్కొన్నారు.

మహిళా సంఘాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని నమ్మబలికిన ప్రభుత్వం ప్రైవేటు సంస్థలవైపు మొగ్గు చూపుతోందని మండిపడ్డారు.సెర్ఫ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం ఎప్పుడు పర్మినెంట్ చేస్తుందో ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ను  సైతం క్రమబద్దీకరించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన సౌకర్యాలు కల్పించాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

ఎమ్మెల్యే రాజాసింగ్పై ఎఫ్ఐఆర్